ఎప్పుడైన వెనుదిరిగి చూసినప్పుడు,
ఏ వీధి మలుపు దగ్గరో,
దూరంగా అలా…
ఏ చెట్టు నీడనో నిల్చుని,
నీకై నే రువ్విన చిన్న నవ్వు గుర్తుకొచ్చి,
మళ్ళీ నా కోసం నువ్వు,అక్కడికే వచ్చి,
అదే స్నేహపూరిత దరహాసం కోసం వెదుకులాడితేనే కదా,
మనది అనిర్వచనీయమైన బంధమని చెప్పుకోవచ్చును!
అదే నీ అభిప్రాయమైతే,మరి ఆలస్యం దేనికి?
ప్రయాణానికి సిద్దం అవుదూ!
ఇక నా సంగతి నీకు తెలీదూ?
నీ కోసం నేనెప్పుడూ,
హేమంతాన ఉషస్సు కొరకెదురు చూసే మందార మొగ్గనే మరి!
హెల్లో! హిమ మందారమా !అభినందనలతో …నూతక్కి.