అప్పుడెప్పుడో... నేనెవరి కంటబడకుండా నా కనురెప్పల మాటున దాచిన హిమకుసుమము అప్రయత్నముగా, అనూహ్యంగా,అకస్మాత్తుగా... నీ ఎదుటే నేల రాలబోయినప్పుడు విచిత్రముగా... నీవు దానిని నేల రాలకుండా ఆపి... నా పెదవుల చిరునవ్వు మొగ్గగా మార్చేసినప్పుడు ఇప్పుడేగా... నేను, 'మన నడుమనున్నది దూరమేనా'__ అని ఆలోచించినది!
హిమకుసుమాలు -94(ఆవిర్భావము)
Filed under Uncategorized
అప్రయత్నముగా, అనూహ్యంగా,అకస్మాత్తుగా…విచిత్రముగా …పద వైచిత్రి.అభినందనలతో …నూతక్కి.