గ్రహిమ్పు

 

 

వేచివున్నప్పుడు అల్లన్త దూరాన్నే నిల్చిరారమ్మన్న కవ్విన్పు

దరి చేరచూసినప్పుడు నన్నన్దుకోమన్టూ ఒకే పరుగు!

నీకై నా ఆరాటమ్

ఆశల ఒడిలోFB_IMG_1453438021553

సేద తీరాలనుకోవటమ్!

Venkata Satyavathi vedantam

ప్రకటనలు

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

హిమకుసుమాలు-100(ముక్తాయింపు)

s2
నాటి చిర్రుబుర్రుల చిత్రాంగి
చీకాకును వదలి
చిరునవ్వుల రంగవల్లులెప్పుడూ పరుస్తోందంటే
నీ సుదీర్ఘ సహవాసమేనని చెప్పాలి మరి!
కాలపురుషుడు ఋతువుల రంగులద్దుకున్నట్లు
నీవైన కళలెన్నో నాలోన!

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

హిమకుసుమాలు-99(అరుదైన అనుభూతలు)

అనావిష్కృత ఫలకం పై
అసంకల్పితముగా ఆకృతిదాల్చి
అనూహ్యమైనా రంగులద్దుకుని
అదేమిటో! వర్ణనకందకుండా
అలవోకగా జారిపోయేవే అయినా,
అప్పుడప్పుడు
ఆ ప్రొద్దుపొడుపు సూరీడి సూటైన చూపుల్లా,
అట్టే, క్షణమాగకుండా అందమైన పదాల్లో ఒదిగి పోతాయి.

 

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

హిమకుసుమాలు-98( అవ్యక్త కావ్యాలు)

అనుబంధానికి ఆదిగా
అక్షరమై నిలిచిన క్షణాలెన్నింటినో
ఓపికగా వున్న ఈ క్షణాన
ఒక్కొక్కటిగా ఏర్చి పేర్చి,
వాటికో పేరిడి,
నీ ముందే మరి …
పంక్తిగా నిలబెడామంటే…
అదేమిటో!
“అలాంటివన్నీ అతనితో అనకు బాగుండదని…”,
అయినవారెందరో వారించినవి గుర్తుకొచ్చి
అదేమిటో మొహమాటమే మరి!
ఇక పంక్తి ఎలా నిలబడుతుంది?
ఎప్పుడైనా నీకూ అటువంటి క్షణమే ఎదురై,
అది నా ముందుకొస్తే తప్పితేనేగానీ !
ఇవి అవ్యక్త కావ్యాలే మరి!
అక్షరమైనవి కాదంటారా?

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

హిమ కుసుమాలు-97(సత్యాసత్యాలు!)

నిజం…
అది ఏమిటోగాని,
గుప్పెడంత గుండెలో,
గుట్టు చప్పుడుకాకుండా ఇమిడిపోతుంది.
ఇక అబద్ధమేమో…
అరవై రంగులు పులుముకుని
ఆర్భటంగా,
“నన్నే చూడండి”! అని లోకాన్ని శాసిస్తూ,
వెరపులేని కన్నె పిల్లలా..
వేగంగా,
మనని కమ్ముకుంటూ,
కలియతిరుగుతుంది సుమండీ!

2 వ్యాఖ్యలు

Filed under Uncategorized

హిమకుసుమాలు-96( వ్యత్యాసం )

నీ అహానికి 
నే తలవగ్గితే,
అది నా మరణమే!

నీ ఔన్నత్యానికి
నే సాగిలపడితే,
అది నా పునర్జన్మే!

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

హిమకుసుమాలు-95( శతమానం భవతి…? )

ఒక ముడి,
మనం బ్రతుకు బాటలో చెట్టాపట్టాలేసుకు నడిచినప్పుడేసుకుందాం!

మరోటి,
మనం అంతర్ముఖంగా ఒకరికి గొడుగుగా ఒకరు నిల్చినప్పుడేసుకుందాం!

ఇక మూడోది,
మన మధ్యన దూరాన్ని మనమే కనిపెట్టలేనప్పుడేసుకుందాం!
 
అప్పుడేగా...
ఆ బంధాన్ని "శతమానంభవతి" అనచ్చు!

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized