Monthly Archives: ఏప్రిల్ 2009

తర్జుమా తలపులు -5((ప్రణయం తాలూకు మిగుళ్ళూ!తగుళ్ళూ-3) )

ప్రవర్తనానియమావళి
ఏం చెప్పగలను నీకు నేను? ఎలా వెనుకకి తీసుకోగలను
నా మూర్ఖపు గళం వెళ్ళగ్రక్కిన దాన్నంతటినీ–
వాస్తవాలు ఇప్పుడిక బయటపడి ,నున్ననైన గచ్చుపై గతుకులై నిల్చాయిగా,
చక్కని స్నేహానుబంధనియమావళి ఉల్లంఘించబడిందిగా?

ఈ ఉషస్సులో అడుగేసినట్లుగా,మాధ్యందినానా నాకు సాధ్యం కాదు
నీవు నిద్రిస్తూ వున్న నిశ్శబ్ధ నిలయం వైపు రావడానికి.
పచ్చికని అణగద్రొక్కి నిల్చిన నా ఈ అడుగుల జాడని మిత్రుడు అగ్ని ప్రక్షాళన గావించు గాక
అటుపై నిను తన వెచ్చదనంతో కమ్ముకుని రక్షణ నొసగు గాక .

ROMANTIC RESIDUES
Vikram Seth
PROTOCOLS

What can I say to you? How can I now retract
All that that fool, my voice, has spoken–
Now that the facts are plain, the placid surface cracked,
The protocols of friendship broken?

I cannot walk by day as now I walk at dawn
Past the still house where you lie sleeping,
May the sun burn away these footprints on the lawn
And hold you in its warmth and keeping.

24 వ్యాఖ్యలు

Filed under తర్జుమా తలపులు

హిమ కుసుమాలు-52 (కించిత్ కినుకతో ఈ కలకంఠి…)


కలలు కల్లలంటూ గేలి చేసే కర్కోటక కింకరులారా!
వినండి! వినండి!
ఎల్లలులేని ఓ కోటకి కవాటాలు నా కళ్ళు
ఆ కోటకి సదా సర్వం సహ వల్లభులుగా నిల్చేది ఎవరో తెలుసుకోండి!
కళకళ్ళాడే నా కలలు!
కాలం కోరలకి చిక్కక
నిన్నని నేటిని కలిపి
రేపటిని కమనీయంగా కళ్ళ నిలిపే కలలు!

నా కలలని కాల రాయాలని కిరాతకులెవరైనా పూనుకుంటామంటే,
వెర్రి వెధవాయ్ లని నవ్వుకుంటా!
అవి వారి ఊహకైనా అందాలిగా!
వాటికి ఓ కళా రూపాన్నిచ్చి,
కలలెన్నటికీ కల్లలు కాకుండా నిలిపేస్తా.

“కలలాగే కళ కూడా కల్ల
వాస్తవాలకి కడు దూరమే” అని మూర్ఖంగా వాదించారా–
“అసలు శాశ్వతమైనదేదో చెప్పండి కుంకలారా?” అని నిలదీస్తా!
వేదికలెక్కి వాదన చేసే వారి మీద కాకి రెట్టెయ్యాలని గుట్టుగా శాపం ఇస్తా!
తస్మాత్ జాగ్రత్త!జాగ్రత్త! నేనసలే “సత్య”వాక్పరిపాలన చేస్తా! (శాపాల విషయంలో!)

5 వ్యాఖ్యలు

Filed under Uncategorized

తర్జుమా తలపులు-4( ప్రణయం తాలూకు మిగుళ్ళూ!తగుళ్ళూ-2)

తర్జుమా తలపులు-4( ప్రణయం తాలూకు మిగుళ్ళూ!తగుళ్ళూ-2)

ఆవలి నుండీ…

నేను ఇన్ని మైళ్ళవతల నుండీ శుభాశీ స్సుల నందిస్తున్నాను నీకు.
గాఢ సుషుప్తి మినహా నిన్నేదీ వెన్నంటి రాకుండా వుండాలని.
నే నుచ్ఛరించనిదేదీ నీకు స్పురించరాదని.
ఏ కలో,కన్నీరో, సందేహమో నీ దరి చేరకూడదని .

స్వాంతనలేని ఈ రోజున నా కలం
ఈ పుటపై కెలికినవేవీ నీ కంట పడక
కొంతకాలం వరకు ముద్రణకు నోచక, నీ చేత
‘ఈ రాతలు నాకు గాక వేరెవరి కొరకో’ అని అనిపించగలగాలని.

ROMANTIC RESIDUES
VIKRAM SETH

ACROSS

Across these miles I wish you well.
May nothing haunt your heart but sleep.
May you not sense what I don’t tell.
May you not dream,or doubt,or weep.

May what my pen this peaceless day
Writes on this page not reach your view
Till its deferred print lets you say
It speaks to someone else than you.

4 వ్యాఖ్యలు

Filed under తర్జుమా తలపులు

తర్జుమా తలపులు-3(ప్రణయపు మిగుళ్ళూ తగుళ్ళూ(1))

ప్రణయపు మిగుళ్ళూ తగుళ్ళూ…(1)

సుడియై!తిరిగి తిరిగి!

విసుగెత్తించే ఓ సుధీర్ఘ విమాన యానం
ఉషోదయాన ప్రారంభమై చీకట్లోకి కూడా చొచ్చుకునిన తరువాతా,
పసిపిల్లల ఏడ్పులతో,విసుగెత్తి వెలువడిన కోపతాపాల నడుమ
ఒఖ్ఖ కుదుపుతో విమానం ఆగగా
పెరపెర పళ్ళెపు ఆహారంపై విస్కీ వొలికింది!
నాదైన సామాను పొందడానికి నా నడక ప్రారంభమైంది.

సామాను యెద మోసుకుంటూ గుండ్రంగా గిరుగిర్రున తిరుగుతోంది ఆ రాట్నం.
ఆదుర్థాగా వెదుకు యాత్రికులు పొందుతున్నారు
తమవైన సంచీలు-చెక్కు చెదరకుండానో,ఏదో కొంత చిరిగో,
కానీ నా ముర్ఖపు కనులనాకర్షించినది
ఆ గంభీరంగా అగపడ్డ చిన్న ఎర్ర పెట్టి.
నాది కానిదే అయినా చుట్టూ సుళ్ళు తిరుగు తోంది.

ఆ సామాను పరిచితమైనదే. తనదే.
ఏడేళ్ళైంది మేం కలసి!
కీచు కీచుమంటూ,కిరకిరలాడుతున్న ఉక్కు బల్లల కదలికలు
ఆహ్లాదకరమైన ఙ్ఞాపకాలై గణ గణమంటూ ఊసులాడాయి.
సర్రున ఓ వయోవౄద్దుడు ఆ సామానందుకున్నాడు .
నావైనవి నాకూ కనపడ్డాయి; నేనూ అందుకున్నాను.

ROMANTIC RESIDUES(1)

Round And Round

After a long and wretched flight
That streched from daylight into nicht,
Where babies wept and tempers shattered
And the plane lurched and whisky splattered
Over my plastic food, I came
To claim my bags from Baggage Claim.

Around, the carousel went around.
The anxious travellers sought and found
Their bags, intact or gently battered,
But to my foolish eyes what mattered
Was a brave suitcase, red and small,
That circled round, not mine at all.
I knew that bag. It must be hers.
We hadn’t met in seven years!
And as the steel plates squealed and clattered
My happy memories chimed and chattered.
An old man pulled it off the Claim.
My bags appeared: I did the same.

వ్యాఖ్యానించండి

Filed under తర్జుమా తలపులు

తర్జుమా తలపులు -2(త్వరలో)

నాకు తెలుసు.త్వరలో నే మౄత్యు వాత పడతాననీ,
నా రక్తంలో పారుతూ వుంది.
అది నన్నూరకే పోనీయదు.
తన కడుపు నింపు కొనుటకు నా కణాలని దొలిచేస్తుంది.

రాత్రిళ్ళు ముచ్చెమటలతో ముంచెత్తి
అటు పై పగటిని బాధకు గురిచేస్తుంది.
ఏ అమౄత హస్తమో,సంజీవనియో ఈ అవయవాలకి రోగ నివారణ గావించలేవు.
ప్రేమ కొరకో,ఐశ్వర్య లబ్ధికో .

మొట్టమొదట కారణమై వింతగా ప్రేమయే
వ్యాప్తి చేసింది ఈ విత్తులో విచారాన్ని,
అటు పై ఐశ్వర్యానికి తన చట్టాలు తెలిసి–
దానికి స్థలాన్నీ, వ్యాప్తినీ నిర్దేశించింది.

దేవుణి దయవల్ల నే ప్రేమించునతడు
ఆశలు పొడచూపే నివారణని గూర్చి ప్రస్తావించడు.
దాని వలన నాకేమి ప్రయోజనముండదు.
ఇది అతనికీ ఎరుకేనని, నాకు ఖచ్చితంగా తెలుసు.

నేనేమి చదివానో అతనికి విదితమే
అందుచే అతడు అసత్యాలని నా దరికి మోసుకు రాడు.
నా నిర్జీవ కళళని అతడు పసికట్టాడు.
అతని కళ్ళు నాకీ విషయాన్ని విశదీకరిస్తున్నాయి.

ఎలా వెళ్ళగలను నేనిప్పుడు–
ఎలా భరిస్తాను ఇట్టి రుచితో గూడిన ,
తెల్లని ద్రవాన్ని నింపుకున్న నా గళాన్ని-
వణుకుతూ అటు పై రాలిపోయే ఈ చేతులనీ?

నా ఉక్కు చువ్వల మంచాన్ననుకుని నిలచి
పడివున్న నను కౌగలించుకో.
జీవాన్ని త్యజించిన వేళ నను ప్రేమించు
అలా నాకు అమరత్వాన్ని చేకూర్చు.

SOON
VIKRAM SETH

I shall die soon, I know.
This thing is in my blood.
It will not let me go.
It saps my cells for food.

It soaks my nights in sweat
And breaks my daya in pain.
No hand or drug can treat
These limbs for love or gain.

Love was the strange first cause
That bred grief in its seed,
And gain knew its own laws–
To fix its place and breed.

He whom I love, thankGod,
Won’t speak of hope or cure.
It would not do me good.
He sees that I am sure.

He knows what I have read
And will not bring me lies.
He sees that I am dead.
I read it in his eyes.

How am I to go on–
How will I bear this taste,
My throat cased in white spawn–
These hands that shake and waste?

Stay by my steel ward bed
And hold me where I lie.
Love me when Iam dead
And do not let me die.

వ్యాఖ్యానించండి

Filed under తర్జుమా తలపులు

తర్జుమా తలపులు!

ఈ నిశీధి నిద్రించు మీకెల్లరికి …

ఈ రేయిని నిద్రించు మీరందరూ
మిము ప్రేమించు వారికి దూరమై,
కుడి ఎడమల ఆప్యాయ హస్తం కరువై,
శూన్యా న్ని నెత్తినేసుకునున్నా–

తెలుసుకోండి.ఒంటరి మీరు మాత్రమే కారని.
మీ కన్నీటిని పంచుకునేందుకు యావత్ జగత్తుందనీ,
కొందరు ఒకటో రెండో రాత్రులే అయినా
మరి కొందరు వారి జీవితమంతా.

All You Who Sleep Tonight
Vikram Seth
All you who sleep tonight
Far from the ones you love,
No hand to left or right,
And emptiness above–

Know that you aren’t alone.
The whole world shares your tears,
Some for two nights or one,
And some for all their years.

ఇక్కడ నేను స్వేచ్చానువాదాన్ని చేసే ప్రయత్నం చేసాను. దీనికి నేను ఏ పర్మిషన్లు తీసుకోలేదు. ఇది కేవలం నా బ్లాగ్ వరకే పరిమితం .

1 వ్యాఖ్య

Filed under తర్జుమా తలపులు

హిమకుసుమాలు-51(ఈ భారతి నోట నేటి భారతం!)


ఏమి వినిపిస్తోంది మన భారతంలో?
పీడిత ప్రజా విలాపాలని వినిపించనీయకుండా
పాలక వర్గాల ప్రగల్భాలు!

ఏమి కనిపిస్తోంది మన భారతంలో?
కౌలుకి తెచ్చుకున్న ఆర్భాటాలొక ప్రక్క
కనుమరుగౌతున్న కారుణ్యమొక ప్రక్క.

ఏమంటోంది ఈ భారతి?
“ఏదైతేం నే అంతరీక్షానికే గురి పెడతా!
అవరోధాలెన్నెదురైనా ఎటో అటు,
ఎప్పుడూ నాది ముందడుగే”!

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized

హిమకుసుమాలు-50(ఇది ఓ సత్యాకలాపం!)


వీధికటువైపు నుండీ
కిరాయి రౌడీలని పంపి
ఇటువైపు నుండీ చొక్కా చించుకుంటూ
నీ కోసమే నేనున్నానంటూ ఎదురొచ్చి పోజు కొట్టీ,
వీధి దీపం క్రింద నా కోసం బీటు వేసే ప్రేమికుడిలా
అతను.
ఎవరు?ఎవరు? ఎవరందురా అతను!
కష్టాలనీ,కడగండ్లనీ కట్టలు కట్టలుగా
నా దగ్గరకంపి
నన్నూ, నా ప్రేమనీ సునాయసంగా పొందాలనుకునే
కిట్ట పరమాత్మే అతను!
మరి నేనేమీ తక్కువ తిన్నానా?
నా కిష్టమైతే పూలు జల్లి
లేకుంటే తిట్లు రువ్వి
అతనితో భామాకలాపాలాడేస్తా!
పేరులో రెండక్షరాలు తక్కువైనా,
సరస సల్లాపములలోనూ, శౌర్యం లోనూ
నేనూ సతి సత్యభామనే మరి!
నేను అదరి అతని దరి చేరాలని అతననుకుంటే,
నే దూరమౌతానేమో నన్న బెదరు అతనిలో నేనూ రేకెత్తిస్తా!

5 వ్యాఖ్యలు

Filed under Uncategorized

హిమ కుసుమాలు-49( నా ఉనికి?)


నీవారి మధ్యన
నీ నీడనే నా గౌరవం.
నావారి నడుమనో
నీ వెంటే నా నడక.,
మనమిర్వురమే కలసున్నఫ్ఫుడు…
ముందు నీవే, తరువా తే నేను.
ఓసారైనా తరచి చూడవా?
ఎక్కడ నాలా నేను, నాకై నేను, వుండగలనో!
అక్కడకి ఓమారైనా వెళ్ళనీవా?
తప్పటడుగైనా సరే! నా అంతట నన్నే వేయనీయవా?

(Where Shall I Be Myself? అన్న స్వీయ కవితకు అనువాదం. )

2 వ్యాఖ్యలు

Filed under Uncategorized

హిమ కుసుమాలు-48( నారీ-నారాయణీయం)


అవని జాత ఆమె.
ఐశ్వర్య జనితములనందించునది.
అరిషడ్వర్గముల జయించి, ఆనంద సాగరమున తేలి,
మనలను తేల్చువాడతడు.
ఇరువురి సంగమమున విరబూసిన వలపు విరజాజి,
కాదందువా,అది అత్యుత్తమ దాంపత్య ధర్మ ప్రబోధి?

అవునది, నారీ నారాయణీయం,
రమణీయం రామాయణీయం!

వ్యాఖ్యానించండి

Filed under Uncategorized